క్వారంటైన్ కి రాని వాళ్ళను ఇంట్లో దూరి కొట్టిన ఎస్సై…!

-

ఒక పక్క కరోనా వైరస్ తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా సరే కొంత మంది ప్రవర్తిస్తున్న తీరు మళ్ళీ ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొందరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజల్లో బాధ్యత ఉండాలని చెప్తున్నా ఎంత మంది ఎన్ని విధాలుగా హెచ్చరించినా సరే కొందరు మాత్రం మాకు నచ్చిందే చేస్తాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. యన్ని రకాలుగా హెచ్చరికలు చేసినా తాము చేసిందే చేస్తాం అంటున్నారు.

ఇక లాక్ డౌన్ ని కట్టడి చేయడానికి గానూ పోలీసులు తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. ప్రజలు మాట వినకపోవడం పోలీసులను బాగా ఇబ్బంది పెడుతున్న పరిణామం. అయితే కొందరు పోలీసులు మాత్రం అతి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు దాడులకు దిగడం ఇప్పుడు చికాకుగా మారింది అనే చెప్పవచ్చు. ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేయడం, బూతులు తిట్టడం వంటివి ఎక్కువగా చేస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో ఒక ఎస్సై గారు… కాస్త అతి చేసారు. జలదంకి ఎస్సై హైదరాబాదు నుంచి వచ్చిన వారి ఇళ్లలోకి వెళ్లి మరీ వారిపై దాడికి దిగారు, ఇంట్లోకి వెళ్లి మరీ కొట్టడం ఏంటీ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎస్సై దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు అందరూ కూడా ఎస్సై గారి తీరుపై అసహనం వ్యక్తం చేసారు. చివరికి అధికారులు జోక్యం చేసుకుని ఆయనతో క్షమాపణ చెప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news