టాలీవుడ్ ని మాయ చేసిన “అక్కినేని సమంత” బర్త్ డే స్పెషల్ …!

-

2010 లో వచ్చిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది సమంత. గౌతం వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించాడు. ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతమందించాడు. ఇక ఈ సినిమా కి ముందు సమంత చిన్న చిన్న యాడ్స్ లో నటించింది. ఆ సమయంలో చూసిన దర్శకుడు ఏం మాయ చేశావే సినిమాకోసం ఆడిషన్ కి పిలిచారు. అప్పటికే దాదాపు డెబ్బై మందిని ఆడిషన్ చేసిన దర్శకుడికి ఎవరూ నచ్చలేదు. అయితే సమంత ని ఆడిషన్ చేసి తనకి తగ్గ అమ్మాయి దొరకడం తో ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నాడు.

Samantha Starting New Business | SVS Partners | LLP Name

ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్ నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్ అవుతావని చెప్పడం విశేషం. ఆరోజు దర్శకుడు చెప్పిన మాట నిజమైంది. టాలీవుడ్, కోలీవుడ్ లో సమంత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రాం చరణ్, నాని, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్…సూర్య, విజయ్, విశాల్ ..ఇలా దాదాపు అందరి స్టార్ హీరోలందరి తో నటించి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది.

 

Samantha shares unseen pictures from wedding with Naga Chaitanya ...

ఇక అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళి చేసుకున్నాక సమంత కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ ప్రయోగాలకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మజిలీ, ఓ బేబి, జాను సినిమాలలో నటించింది. ముఖ్యంగా పెళ్ళి తర్వాత నాగ చైతన్య సమంత కలిసి నటించిన మజిలీ భారీ హిట్ ని దక్కించుంది. అందుకే మరోసారి ఇద్దరు కలిసి నటించగలిగే స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సమంత సామాజిక సేవలోను ముందుంటుంది. ఇప్పటికే కొంతమంది అనాధ పిల్లలని దత్తత తీసుకుంది.

 

Samantha gets a sweet birthday surprise from husband Naga Chaitanya

ఇక సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూనే వ్యాపార రంగంలోను రాణిస్తుంది. ఇక మరోవైపు వెబ్ సిరీస్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఫ్యామిలీ మాన్ 2 లో ఒక వినూత్నమైన పాత్ర పోషించింది. ఇక త్వరలో మరోసారి నందిని రెడ్డి దర్శకత్వం వహించబోయో సినిమాలో సమంత నటించబోతుందని సమాచారం. అంతేకాదు సొంతగా నిర్మాణ సంస్థని స్థాపించి మంచి సినిమాలని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ గా ఎదిగినప్పటికి కాస్త కూడా స్టార్ హోదా చూపించకుండా అందరితో కలిసిపోయో మంచి గుణమున్న అక్కినేని సమంత కి స్పెషల్ బర్త్ డే విషేస్.

Read more RELATED
Recommended to you

Latest news