తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో సముద్రం మీద నిర్మించిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌గా దీనిని పిలుస్తారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం తమిళనాడుకు చేరుకున్న ఆయన రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు.
అనంతరం దీనిని ఆయన జాతికి అంకితమిచ్చారు.తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో ఈ కొత్త బ్రిడ్జిని నిర్మించిన విషయం తెలిసిందే. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున దీని నిర్మాణం చేపట్టారు. వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న బ్రిడ్జి పాతది కావడంతో దాని పక్కనే కొత్త నిర్మాణం చేపట్టారు.
పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (పాంబన్ వంతెన) ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు. దీన్ని ఆయన జాతికి అంకితమిచ్చారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో ఈ బ్రిడ్డు నిర్మించారు. సముద్రంలో 2.08… pic.twitter.com/1go2IBQdl5
— ChotaNews App (@ChotaNewsApp) April 6, 2025