పిల్లలు ఇళ్ళ నుంచి బయటకు వస్తే తల్లి తండ్రులపై కేసులు…!

-

కరోనా లాక్ డౌన్ ని చాలా మంది సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనపడట౦ లేదు. తీవ్రత ఎంత దారుణంగా ఉన్నా సరే మా ఇష్టం అన్నట్టు రోడ్ల మీదకు వస్తున్నారు జనాలు. ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేసినా సరే ఎవరూ కూడా వినే పరిస్థితి లేదు. కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే మారడం లేదు. ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రజలు మాత్రం రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. దీనితో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

పెద్దలు బయటకు వస్తే… వాహనాలను స్వాధీనం చేసుకుని హత్యానేరం కేసు పెట్టాలని తెలంగాణా పోలీసులు భావిస్తున్నారు. అదే విధంగా పిల్లలు బయటకు వస్తే తల్లి తండ్రుల మీద కేసు పెట్టాలని భావిస్తున్నారు. ఎవరి పిల్లలను వారు కట్టడి చేసుకోవాలని లేకపోతే కేసులు పెట్టడం ఖాయమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోన్నారని పోలీసులు భావిస్తున్నారు.

నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. దాదాపు 150 కేసులు నమోదు అయ్యాయి. ప్రాణాలకు తెగించి పోలీసులు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య విభాగాల అధికారులు సిబ్బంది ప్రజల కోసం పోరాడుతున్నందున ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నా సరే జనం మాత్రం మాట వినే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. అందుకే ఇక కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news