అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో అర్ధం కాక ప్రపంచ దేశాల ముందు ఆయన సాయం కోసం అభ్యర్ధించారు. చైనా, రష్యా, క్యూబా, ఇండియా దేశాలను ఆయన సహాయం కోరారు. భారత్ నుంచి యాంటీ మలేరియా డ్రగ్ కావాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడిని విజ్ఞప్తి చేసారు.
ఆదివారం ఫోన్ చేసి ట్రంప్… మోడిని అడిగారు. కాని తమకు అవసరం ఉందని భావించిన మోడీ తాము ఇవ్వలేమని చెప్తూ కఠిన ఆంక్షలను విధించారు. 24 రకాల మందుల ఎగుమతిని ఆయన నిలిపివేశారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే మంగళవారం ప్రధాని నరేంద్ర మోడికి ఫోన్ చేసి బెదిరింపు ధోరణి తో మాట్లాడారు. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
దీనితో వెనక్కు తగ్గిన మోడీ డ్రగ్ ని ఎగుమతి చేయడానికి అంగీకారం తెలిపారు. దీనికి మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసారు. కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఫోన్ చేసారు. యాంటి మలేరియా డ్రగ్ పంపినందుకు గానూ ఆయన అభినందించారు. ఇలా చేస్తే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా అమెరికాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీనితో ఆ మందు అమెరికాకు చాలా అవసరమైంది.