గత ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు ఉద్యమ విరమణపై గురువారం ప్రకటన చేసే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతల డిమాండ్ల అన్నింటికీ సూచనప్రాయంగా అంగీకారం తెలుపడం, లిఖితపూర్వకంగా రాసివడమే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12గంటలకు సింఘు బార్డర్‌లో రైతు సంఘాల నేతలు ఉద్యమ విరమణపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది.
పంటల మద్దతు ధరల చట్టబద్ధతపై ఏర్పాటు చేసే కమిటీలో సంయుక్త కిసాన్ మోర్చా సభ్యులను చేర్చడం, రైతులపై పెట్టిన కేసులను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. విద్యుత్ సవరణ బిల్లులో రైతులపై ప్రభావం చూపే నిబంధనల గురించి ఎస్‌కేఎంతో చర్చించిన తర్వాతే పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక మిగిలింది పై హామీలపై లిఖిత పూర్వక హామీ. ఇది కేంద్ర ప్రభుత్వం లభించగానే రైతు సంఘాల నేతలు ఉద్యమాన్ని విరమించనున్నాయి.