రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం.. త్వరలోనే కొత్త పార్టీ

-

తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. గాంధీ జయంతి రోజున ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తారు. అక్టోబర్ 2న జన్ సూరాజ్ పార్టీని ప్రశాంత్ కిషోర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రశాంత్ కిషోర్..పలు రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైసీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు వ్యూహకర్తగా పని చేశారు. బీహార్‌లోని జేడీయూ నేతగా ఉన్నారు. అయితే 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై నితీష్ కుమార్ అవలంభించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు.. ఆయనను 2020, జనవరి 29న పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు 5 సంవత్సరాల పాటు ఐక్యరాజ్యసమితిలో పని చేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో మూడోసారి సీఎంగా ఎన్నికయ్యేందుకు మోడీకి సాయం చేశారు. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించేందుకు కృషి చేశారు. ఇక 2019లో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీకి, 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి, 2021లో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కిషోర్ పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news