తమిళనాడు సంక్షేమం కోసం రాజకీయం: దళపతి విజయ్

-

ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయ ప్రవేశానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆ స్పందనకు కృతజ్ఞతగా ఆయన తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. ‘తమిళనాడు సంక్షేమం కోసం నేను మొదలుపెట్టిన ఈ రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపిన వివిధ రాజకీయ పార్టీలకు, సినీ పరిశ్రమలోని మిత్రులకు, తమిళనాడులోని నా సోదరసోదరీమణులు, తల్లులకు, మీడియా స్నేహితులకు నా కృతజ్ఞతలు’ అని అందులో పేర్కొన్నారు.

ఇక ఈ పార్టీకి “తమిళ వెట్రి కజగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వడం లేదని ఆయన ప్రకటించారు.2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news