మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో లోక్సభ ,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒకరిపై ఒకరు రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు.ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ అర్జునుడిలా ఫీలవుతున్నారని ఎద్దేవ చేశారు.మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ…..’మమ్మల్ని జగన్ కౌరవులు అంటున్నారు . ఇది కలియుగం. కౌరవులు పాండవులతో పోల్చుకోకండి అని అన్నారు.
జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా? అని ప్రశ్నించారు.ఆమెపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడినా ఆయన పట్టించుకోరు అని విమర్శించారు.. జగన్.. ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. సభలు పెడతాం’ అని తెలిపారు.వివేకా కుమార్తె సునీత తనకు రక్షణ లేదు.. చంపేస్తారని భయంగా ఉందని చెబుతున్నా పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు.సొంతబాబాయిని దారుణంగా చంపేసిన నిందితుల్ని వెనకేసుకొస్తున్నాదని ఆరోపించారు .