కర్ణాటకలో కమలం కోసం కేసీఆర్ ఆ పని..రేవంత్ సంచలనం.!

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఫలితాలు కూడా రానున్నాయి. ఇక ఎన్నికల తర్వాత వచ్చిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్..కాంగ్రెస్ అధికారంలో వస్తాయని చెప్పాయి..కొన్ని సర్వేలు హాంగ్‌ దిశగా వెళుతుందని చెప్పాయి. సరే ఏదేమైనా గాని రెండు రోజుల్లో కర్ణాటక కింగ్ ఎవరో తేలిపోతుంది. అయితే బి‌ఆర్‌ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని చూస్తున్న కే‌సి‌ఆర్..కర్ణాటక ఎన్నికలపై ఫోకస్ పెట్టలేదు.

కానీ ఆయన పరోక్షంగా జే‌డి‌ఎస్‌కు సహకరించారని, ఆర్ధికంగా సపోర్ట్ చేశారని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే జే‌డి‌ఎస్ బలం పెంచి..హాంగ్ వచ్చేలా చేసి..బి‌జే‌పి-జే‌డి‌ఎస్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారని అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని,  ఈ సారి ఎంఐఎంను ఎక్కువగా పోటీ చేయనీయకుండా కేసీఆర్ చేశారని చెప్పుకొచ్చారు. అంటే గతంలో కర్ణాటకలో మైనార్టీ ఓట్లు ఎక్కువ జే‌డి‌ఎస్‌కు పడ్డాయని, ఇప్పుడు ఎం‌ఐ‌ఎం పోటీ చేస్తే  ఆ ఓట్లు చీలిపోయి, జే‌డి‌ఎస్‌కు నష్టం జరుగుతుందని, అప్పుడు జే‌డి‌ఎస్ ఎక్కువ సీట్లు రావని, అందుకే ఎం‌ఐ‌ఎంని కే‌సి‌ఆర్ బరిలో లేకుండా చేశారని రేవంత్ అంటున్నారు.

ఇక ఇటీవలే తెలంగాణకు ప్రియాంక గాంధీ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె చేత యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇక జూన్ లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఇక మహిళా,మైనారిటీ, ఓబీసీ డిక్లరేషన్‌లని సైతం ప్రకటిస్తామని రేవంత్ అంటున్నారు. సెప్టెంబర్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం తొమ్మిది డిక్లరేషన్ లు ప్రకటిస్తామని, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే హామీలు ఇస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version