హ్యాట్రిక్‌పై గువ్వల గురి..వంశీ ఛాన్స్ ఇస్తారా?

-

తెలంగాణ తెచ్చిన పార్టీగా వరుసగా బి‌ఆర్‌ఎస్ రెండుసాలృ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అయితే తెలంగాణ సెంటిమెంట్, కే‌సి‌ఆర్ ఇమేజ్ తో బి‌ఆర్‌ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వారు కూడా పార్టీ తో పాటు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

అలా హ్యాట్రిక్ పై కన్నేసిన నాయకుల్లో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఒకరు. గత రెండు ఎన్నికల్లో గువ్వల బి‌ఆర్‌ఎస్ నుంచి విజయం సాధించారు. వాస్తవానికి అచ్చంపేట టి‌డి‌పి కంచుకోట. 1983, 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి పి. రాములు మూడుసార్లు గెలిచారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టి‌డి‌పి నష్టపోయింది. దీంతో 2014లో బి‌ఆర్‌ఎస్ నుంచి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్ధి చిక్కుడు వంశీకృష్ణపై విజయం సాధించారు. టి‌డి‌పి నుంచి రాములు పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

 

ఇక 2018 ఎన్నికల్లో మళ్ళీ గువ్వల బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి కే‌సి‌ఆర్ వేవ్ లో గెలిచేశారు. కాంగ్రెస్ నుంచి వంశీ మళ్ళీ పోటీ ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గువ్వల ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సారి ఆయనకు పరిస్తితులు అనుకూలంగా లేవు. కాస్త ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే ఈ 9 ఏళ్లలో అనేక ఆరోపణలు వచ్చాయి.

ఇటు వరుసగా ఓడిపోతున్న వంశీపై సానుభూతి ఉంది. ప్రజల్లో తిరుగుతూ ప్రజా మద్ధతు పెంచుకుంటున్నారు. ఈ పరిణామాలని చూస్తుంటే గువ్వలకు వంశీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లోనే 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి గువ్వలకు హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చేలా లేరు. చూడాలి మరి అచ్చంపేటలో ఈ సారి పైచేయి ఎవరిదో.

Read more RELATED
Recommended to you

Latest news