ఓ అక్కా…ఓ చెల్లి…ఓ అవ్వా…ఓ తాతా…అంటూ ఒకటో తేదీన తలుపు తట్టి మరీ చిరునవ్వుతో పెన్షన్ అందించే వాలంటీర్ల సేవలకు బ్రేక్ పడటంతో ఇప్పుడు వాళ్లే సీఎం జగన్ కి స్టార్ క్యాంపెయినర్లు అవుతున్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొన రాదని ఎన్నికల కమిషన్ చెప్పడంతో స్వచ్చందంగా రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు.ఈ రాజీనామాల పర్వం ఏపీ వ్యాప్తంగా ఒక ఉద్యమంగా నడుస్తోంది. ఎక్కడిక్కడ స్వచ్చందంగా రాజీనామా సమర్పించి జగన్ అన్నకు అండగా నిలుస్తున్నారు.ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఇంకా రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రజలకు,ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా వాలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు.సీఎం జగన్ పై ఉన్న అభిమానంతో మండపేటలో 800 మంది గ్రామ,వార్డు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించి సంచలనం రేపారు.వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వీళ్ళందరు రాజీనామా పత్రాలు సమర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించే సమయంలో పెద్ద ఎత్తున ఆహ్వానమ్ పలికి అడుగడుగునా అవరోధాలు లేకుండా బస్ యాత్రను నడిపించేందుకు సిద్ధమవుతున్నారు.గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు సహా లోకేష్,పవన్ కళ్యాణ్, ఇంకా పలువురు టీడీపీ నేతలు వాలంటీర్లపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో ఆ అవమానాలను వారు భరిస్తూ వస్తున్నారు.కష్టకాలంలో వాలంటీర్ గా అవకాశమిచ్చి సేవ చేసే భాగ్యాన్ని కలిగించారని అందుకే జగనన్నకు అండగా ఉంటామని వారు అంటున్నారు.
ఇక మండపేటలో రాజీనామాలు సమర్పించిన వాలంటీర్లు గొప్పగా స్పందించారు. ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేసే అదృష్టాన్ని సీఎం జగన్ కల్పించారనిఅన్నారు. పేదవారికి సేవ చేస్తుంటే చంద్రబాబు… స్లీపర్ సెల్స్ అంటూ అపవాదు వేశారని ఆవేదన చెందారు.మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని అప్పుడే విధుల్లో చేరతామని చెప్పారు.మళ్లీ వైసీపీ గెలుపు కోసం స్వచ్చందంగా ప్రజల్లోకి వెళతామని ఆ దిశగా ఓటర్లను చైతన్యపరుస్తామని స్పష్టం చేశారు.మొత్తానికి సీఎం జగన్ కోసం వాలంటీర్లు ఏపీలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.