దేవుడి దయతో రాయి కంటికి, తలకు తగల్లేదు : సీఎం వైఎస్ జగన్

-

‘నా నుదుటిపై వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ పేదలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎన్నటికీ తగ్గవు’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గుడివాడలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్. దేవుడి దయతో రాయి కంటికి, తలకు తగల్లేదని అన్నారు. దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాశాడని, అందుకే తనకు పెద్ద గాయం కాలేదని తెలిపారు. తనపై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోందని, కుట్రలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

నిరుద్యోగ భృతి,ఇంటికో ఉద్యోగం, మూడు సెంట్ల స్థలం, రుణమాఫీ, సింగపూర్ తరహా అభివృద్ధి లాంటి హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ బాబు, దత్తపుత్రుడు, బీజేపి కలిసి వస్తున్నారు. లంచాలు లేని పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి అని కోరారు. 175కి 175 సీట్లలో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు.. సిద్ధమేనా. దేవుడి దయతో జగన్ అనే నేను మళ్లీ మీ ముందుకి వస్తాను’ అని ఘంటాపథంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version