జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సినీ నటుడు అలీ…

-

ఏపీలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకు ఇంకా నెల రోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార పార్టీ టీడీపీకి షాకులు ఇస్తూ పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు.తాజాగా సినీ నటుడు అలీ కూడా వైసీపీలో చేరారు. ఇవాళ జగన్ ను కలిసిన అలీ అయన సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్… ఆలీకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు రావడంతో అలీని ఎన్నికల ప్రచారం కోసం జగన్ ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అలీ పర్యటించి వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తారట. అలీకి ఇప్పుడు టికెట్ ఇవ్వకపోయినా భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానం కల్పించాలనే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇవ్వాళ కాకినాడ లో జరగనున్న వైసీపీ సమర శంఖారావం సభకు ముందే అలీ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

మరో వైపు రేపు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా రేపే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు నెల్లూరు ఎంపీ సీటు ను ఇవ్వనున్నట్లు సమాచారం. మార్చ్ 15 నుంచి జగన్ బస్ యాత్రను ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version