ఎన్నికల్లో వీరంతా సీఎం వారసులే…!

-

ప్రస్తుత ఏపీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… ఈ ఎన్నికలు అటు టీడీపీ, ఇటు వైసీపీకి చావు రేవు లాంటివనే మాట కూడా వినిపిస్తోంది. అదే సమయంలో ఈ ఎన్నికలు కొందరు సీనియర్ నేతలకు చివరివి కూడా అనేది కూడా వాస్తవం. ఇక ప్రస్తుత ఎన్నికల్లో పలువురు మాజీ సీఎంల వారసులు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు కూడా.

సాధారణంగా ప్రతి ఎన్నికల్లో ఒకరో ఇద్దరో సీఎంలు పోటీ చేస్తారు. అలాగే సీఎంల వారసులు లేదా కుటుంబ సభ్యులు ఓ నలుగురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం… ఏకంగా ముగ్గురు సీఎంలు, 9 మంది వారసులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు, జగన్ తో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. అయితే కిరణ్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇకపోతే.. ఈ ఎన్నికల్లో… మాజీల వారసులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ హిందూపురం నుంచి అసెంబ్లీకి, కుమార్తె పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుత సీఎం జగన్, షర్మిల కూడా రాజశేఖరరెడ్డి వారసులే. వీరితో పాటు లోకేష్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version