జమిలి ఎన్నికల వేళ.. ఏపీలో మరోసారి తెరమీదకు పొత్తుల పంచాయతీ..

-

కేంద్ర ప్రభుత్వం 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది..ఎన్డీఏ మిత్ర పక్షాల నుంచి కూడా మద్దతు లభించడంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.. కాంగ్రెస్ పార్టీతో పాటు.. పలు చిన్నాచితకా పార్టీలు వ్యతిరేకిస్తున్నా.. అవేమీ బిజేపీ పట్టించుకోవడంలేదు.. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాలి.. అభివృద్ది జరగాలనే నినాదంతో ప్రధాని మోడీ, అమిత్ షాలు దేశంలోని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారు.. కొన్ని రాష్టాలు ఒప్పుకుంటే.. మరికొన్ని మాత్రం డైలమాలో పడ్డాయి..

ఆంద్రప్రదేశలో టీడీపీతో జతకట్టిన బిజేపీ, జనసేనలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. రికార్డు స్థాయిలో అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని తమకు తిరుగులేదని నిరూపించాయి.. మరోసారి అధికారంలోకి వస్తామని కాన్పిడెంట్ గా ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది..ఓడినా.. మంచి ఓటుషేర్ మాత్రం సంపాదించుకుంది.. ఘోర ఓటమితో వైసీపీ శ్రేణులు నిరాశల్లో ఉండగా.. జమిలి ఎన్నికలు వస్తున్నాయన్న వార్త వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది.. జమిలి వస్తే గెలిచేది తామేనన్న నమ్మకంలో పార్టీ క్యాడర్ ఉంది..

నిన్నమొన్నటి దాకా జమిలి మీద ఎలాంటి ప్రకటన చెయ్యని చంద్రబాబు నాయుడు ఇటీవల డిల్లీకి వెళ్లిరాగానే.. జమిలీ మీద తన అభిప్రాయాన్ని ప్రకటించారు. జమిలీ ఎన్నికలు వస్తే దేశానికే ప్రయోజనమని చెప్పుకొచ్చారు.. అంటే జమిలి ఎన్నికలను తాము స్వాగతిస్తున్నామని చెప్పకనే చెప్పారు..జమిలి ఎన్నికల లోపే..హామీలను అమలు చెయ్యాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.. జనసేన అధినేత పవన్ కూడా ప్రధాని మోడీ మాట కాదనరు.. కాబట్టి అతనికి కూడా ఎలాంటి సమస్య లేదు..

2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయనే టాక్ బయటికి రాగానే.. ఏపీలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.. మూడు పార్టీలు మరోసారి కలిసి పోటీ చేస్తాయా లేదా అనే డిస్కర్షన్ మొదలైంది.. దూకుడుగా వ్యవహరించే పవన్ కళ్యాణ్ మరోసారి కలిసి పోటీ చేసేందుకు ఒప్పుకుంటారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.. వైసీపీ మీద నిత్యం విమర్శలు చేసే పవన్.. తాజాగా హోంమంత్రిని పరోక్షంగా హెచ్చరించారు.. దీంతో పొత్తుకు బీటలు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.. అయితే జమిలి ఎన్నికల దాకా పొత్తు ఉంటుందా అనే అనుమానం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version