అటు రాంబాబు-ఇటు రజిని..ప్రత్యర్ధుల దూకుడు..చెక్ పెట్టగలరా.!

-

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన విజయమే ప్రధానం..విజయాలు అందుకున్న నాయకులకే విలువ ఉంటుంది..ప్రాధాన్యత ఉంటుంది..పైగా అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు అందుతాయి. అందుకే ఏ నాయకుడుకైన చివరి లక్ష్యం ఎన్నికల్లో విజయం సాధించడమే. అయితే మరొకసారి విజయం అందుకోవాలని చెప్పి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజిని ప్రయత్నిస్తున్నారు.

గత ఎన్నికల్లో వీరిద్దరి విజయాలు ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే ఒకరు తొలిసారి గెలిచారు…మరొకరు 30 ఏళ్ల తర్వాత గెలిచారు. ఎప్పుడో 1989లో రేపల్లె నుంచి కాంగ్రెస్ తరుపున అంబటి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత విజయం అందుకోలేదు. తర్వాత జగన్ వెంట నడిచారు. 2014లో కూడా ఆయనకు విజయం దక్కలేదు. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అంటే 2019లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలిచారు. రెండో విడతలో మంత్రి పదవి వరించింది. ఇక మళ్ళీ సత్తెనపల్లి నుంచి గెలవాలని చూస్తున్నారు. కానీ ఈ సారి ఆయనకు గట్టి ప్రత్యర్ధి ఎదురయ్యారు. కోడెల శివప్రసాద్ చనిపోవడంతో..సత్తెనపల్లి టి‌డి‌పిలో వర్గ పోరు ఎక్కువైంది.

చాలామంది నేతలు సీటు కోసం పోటీ పడ్డారు. అందులో కోడెల తనయుడు శివరాం కూడా ఉన్నారు. ఆయనకు సొంత పార్టీలోనే యాంటీ ఉంది. ఇక వారందరినీ పక్కన పెట్టి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు. కన్నా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అంబటిపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. దీంతో అంబటికి గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది.

ఇక రాజకీయాల్లోకి వచ్చిన ఫస్ట్ టైమ్ టి‌డి‌పి నుంచి వైసీపీలోకి జంప్ చేసి చిలకలూరిపేట సీటు దక్కించుకుని తొలిసారి గెలిచారు. తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినికి టి‌డి‌పి సీనియర్ ప్రత్తిపాటి పుల్లారావు నుంచి పోటీ ఉంది. ఆయన మొన్నటివరకు సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పుడు రజిని టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. పేటలో ఆమె అవినీతికి అంతు లేదని ఆరోపణలు చేస్తున్నారు.

ఇలా రాంబాబు, రజిని ప్రత్యర్ధులు దూకుడుగా ఉన్నారు. మరి ఈ సారి వారికి చెక్ పెట్టి ఇద్దరు గెలుస్తారా? లేదా ఇద్దరికి టి‌డి‌పి నేతలు చెక్ పెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version