అనాధాశ్రమంలో బాలిక రేప్ కేసు…వెలుగులోకి సంచలన అంశాలు !

-

అమీన్ పూర్ అనాథ ఆశ్రమంలో మైనర్ బాలిక మీద జరిగిన లైంగిక దాడి ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మరో మైనర్ బాలిక పై నిందితుడు వేణుగోపాల్ రెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ బాలిక కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాహకుల బెదిరించినట్టు తెలుస్తోంది. ఇలా మారుతీ అనాథ ఆశ్రమ ఆగడాలు ఆలస్యంగా ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో ఆశ్ర నిర్వాహకులకు సన్నిహిత సంబంధాలు కూడా గుర్తించారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

rape

లాక్డౌన్ సమయంలో రెస్కూ చేసిన మైనర్లను తమ ఆశ్రమానికే పంపాలని సీడబ్ల్యూసీ సిబ్బందిపై వేణుగోపాల్ రెడ్డి ఒత్తిడి చేసినట్టు చెబుతున్నారు. అలానే కమిటీ సమావేశాలకు సైతం నేరుగా నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యాడని అంటున్నారు. హైపవర్ కమిటీ విచారణలో వెలుగులోకి మరిన్ని ఆగడాలు వస్తాయని భావిస్తున్నారు. అలానే అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 70 మందిని అధికారులు విచారించనున్నారు. ఈ ఎఫెక్ట్ తో రాష్ట్రంలోని ఇతర అనాథ ఆశ్రమలాల్లో తనిఖీలు చేయమని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 400 ఆశ్రమాలు, లెక్కల ప్రకారం 19 వేల మంది అనాథలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version