షా స్కెచ్..తెలంగాణలో బిగ్ ట్విస్ట్?

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి..కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. ఎక్కడ వెనుకడుగు వేయకుండా బీజేపీ నేతలు పోరాడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో అన్నీ స్థానాల్లో బీజేపీకి బలం లేదు.

కానీ ఇప్పుడు ఆ బలాన్ని బూత్ స్థాయి నుంచి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలని కీలక నేతలకు అప్పజెప్పారు. ఇటీవలే బూత్ లెవెల్ నాయకులని పెట్టుకున్నారు. ఇలా అన్నీ రకాలుగా సత్తా చాటాలనే దిశగా బీజేపీ పనిచేస్తుంది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు సైతం..తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. రాష్ట్ర నేతలకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు అడపాదడపా కేంద్రం పెద్దలు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి పార్టీ పరిస్తితులని పరిశీలిస్తున్నారు.

ఏదొక అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రధాని మోదీ..తెలంగాణకి వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రామగుండం  ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఇక ఈ నెల 19న పలు రైల్వే పనుల అభివృద్ధి పనులని ప్రారంభించడానికి వస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ తరుపున భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా వస్తున్నారు. గతేడాది ఆయన 5 సార్లు తెలంగాణకు వస్తున్నారు.

షా కేవలం పార్టీ సంస్థాగత బలాన్ని మరింత పెంచే విధంగా నేతలకు దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. పకడ్బంధీగా వ్యూహాలు అమలు చేస్తూ..వీక్ గా ఉన్న స్థానాల్లో ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులని బీజేపీలోకి తీసుకురావలనే స్కెచ్ వేశారు. మొత్తానికి తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అమిత్ షా వ్యూహాలు అమలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version