ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్నీ మద్యపానం పైనే నడుస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. ఇటీవల జంగారెడ్డి గూడెంలో మరణాలకు కల్తీ మద్యమే కారణం అంటూ… టీడీపీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే బర్నింగ్ టాపిక్ అయింది. అసెంబ్లీలో చివరకు దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా వివరణ ఇచ్చారు. అసలు జంగారెడ్డి గూడెంలో అక్కడక్కడ చోటు చేసుకున్న మరణాలను టీడీపీ వక్రీకరిస్తుందంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు.
ఇంతకీ అసలు ఏపీలో మద్యపాన నిషేధం ఉన్నట్లా.. లేనట్టా..? లేకపోతే గవర్నమెంట్ కు ఇంత ఆదాయం ఎక్కడ నుంచి వస్తోంది. ఎక్కువ రేట్లు పెంచి ప్రజల నడ్డి విరస్తున్నారా..? అనే అనుమానాలు కలుగకమానవు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లతో మద్యం అమ్ముతున్నారని.. నాసిరకం మద్యం అమ్ముతూ… జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి.
నిజానికి మద్యంపై వచ్చే ఆదాయంపై ప్రభుత్వానికి ఆసక్తి లేదంటూ… ఎక్కువ ధరలు ఉంటే పేదలు కొనరనేది ప్రభుత్వం వాదన అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ వాదన సరైనదేనా..? అని అనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో 2016-17 మద్యం అమ్మకాల ద్వారా 4644 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే జగన్ పాలనతో 2021-22లో 14,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడే సగటు ఏపీ వాసికి డౌటనుమానం వచ్చేది. అసలు మద్యపాన నిషేధం ఉంటే… మద్యం ద్వారా వచ్చే ఆదాయం తగ్గాలి కానీ పెరుగుతుండేంటబ్బా..? అనేది సామాన్యుడి అనుమానం.
నిజానికి తెలంగాణ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతుంది. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో పంగడల దగ్గర నుంచి చావు వరకు సందర్భం ఏదైనా మద్యం అనేది తప్పనిసరి అయింది. దీని వల్ల తెలంగాణలో విక్రయాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ మద్యపాన నిషేధం ఉన్న ఏపీలో మద్యపానంపై వచ్చే ఆదాయం… తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంతో పోటీ పడుతుండటం ఇక్కడ ఆశ్చర్చకర విషయం. అయితే మద్యపాన నిషేధంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతున్నాడా…? ఈ ప్రశ్నకు సమాధానం ఏపీ ప్రజలకే తెలియాలి మరి.