నెల్లూరులో అనిల్‌కు సపోర్ట్ కరువు..సొంత పార్టీలోనే యాంటీ.!

-

వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నెల్లూరు సిటీలో రాజకీయం కలిసిరావడం లేదు. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఆయనకు సీటు రాకుండా సొంత పార్టీ వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అనిల్‌ని టార్గెట్ చేసుకుని నారా లోకేష్, ఆనం రామ్ నారాయణ రెడ్డి..ఇతర టి‌డి‌పి నేతలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. విమర్శలు చేస్తున్నారు. వాటికి అనిల్ ఒక్కరే కౌంటర్ ఇచ్చుకుంటున్నారు.

సొంత పార్టీ నుంచి ఆయనకు మద్ధతు రావడం లేదు..ఆయన తరుపున మాట్లాడే నేతలు కనిపించడం లేదు. దీంతో సిటీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నుంచి నెల్లూరు సిటీలో రెండుసార్లు గెలిచిన..జగన్ దీవెనతో మంత్రి కూడా అయ్యారు. మంత్రి పదవి అనుకున్న మేర సక్సెస్ గా ముందుకు సాగలేదు. తర్వాత పదవి పోయింది. ఇక ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో కూడా అనుకున్న మేర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. పైగా ఆయన పై పలు ఆరోపణలు రావడం ఇబ్బందిగా మారింది.

ఇదే క్రమంలో తన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ యాంటీగా మారిపోయారు. గత ఎన్నికల్లో అనిల్ గెలుపు కోసం రూప్ కుమార్ పనిచేశారు. కానీ ఇప్పుడు రూప్ కుమార్ సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. ఈయన కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని రూప్ కుమార్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయించడానికి అనిల్ ట్రై చేస్తున్నారు.

ఇదే సమయంలో నెక్స్ట్ సిటీ సీటు దక్కించుకోవాలని రూప్ కుమార్..జిల్లాలోని వైసీపీ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మద్ధతు రూప్ కుమార్‌కు ఉంది. దీంతో సిటీలో సీన్ మారుతుంది. అనిల్ ఒంటరి అవుతున్నారు..సీటు కూడా డౌటే అని పరిస్తితి. మరి అనిల్ విషయంలో జగన్ ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version