రూ.12 లక్షలకు 176 కిలోల ‘కింగ్ మేక’ సేల్

-

సాధారణంగా ఒక మేక మహా అయితే పది నుంచి 20 కిలోల బరువు ఉంటుంది. కొన్నిసార్లు 50 కిలోల వరకు కూడా ఉండవచ్చు. కానీ మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో మాత్రం ఏకంగా ఓ మేక 176 కిలోల బరువు ఉంది. ఇంత బరువున్న మేకను బక్రీద్ సందర్భంగా విక్రయానికి పెట్టాడు ఆ యజమాని. మరి ఈ మేక ఎంత ధరకు పలికిందో తెలుసా..?

బక్రీద్‌ కోసం 176 కిలోల బరువున్న ఓ మేకను విక్రయానికి పెట్టగా 12లక్షల రూపాయల భారీ ధర పలికింది. మేకల పెంపకంపై ఆసక్తితో సుహైల్ అహ్మద్‌ అనే వ్యక్తి.. 8 నెలల కిందట రాజస్థాన్ లో ఓ మేకను కొనుగోలు చేశారు. దానికి కింగ్ అనే పేరు పెట్టి పెంచారు. ఆ మేకను బక్రీద్ సందర్భంగా అమ్మకానికి పెట్టడంతో 12 లక్షల రూపాయలు పలికింది. కోటా జాతికి చెందిన ఈ మేక బరువు దాదాపు 176 కిలోలు ఉంటుందని ముంబయికి చెందిన ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసినట్లు అహ్మద్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version