ఏపీలో మరో ముస్లిం కుటుంబ వివాదం, అధికారులు ఇంకా ఇంతేనా…?

ఏపీలో ఈ మధ్య అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడో ఒక చోట అధికారులు వివాదాలతో సావాసం చేస్తూనే ఉన్నారు. ఎన్ని జరుగుతున్నా సరే వారిలో మార్పు రావడం లేదు. తాజాగా మరో వివాదంలో వారు చిక్కుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం లో మరో ముస్లిం కుటుంబానికి వేదింపులు మొదలయ్యాయి.

షేక్ గాలీబ్ సాహెబ్ ఇంటి రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేసారు. ప్రైవేట్ స్థలం లో పంచాయితీ రోడ్డు చేయడాన్ని గాలీబ్ కుటుంబం వ్యతిరేకిస్తుంది. అయినా జేసిబీ తో పనులు ప్రారంభించారు. దీనితో వారికి అడ్డంగా… జేసిబీ కి అడ్డం కూర్చున్న స్దానిక మహిళలు… అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అమరావతి మండలం మునుగోడు లో అర్ధరాత్రి ఈ వివాదం జరిగింది.