మ‌ద్యం ధ‌ర‌ల వ‌ల్లే గ్రామాల్లోకి నాటు సారా : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌ద్యం ద‌ర‌లు ఎక్కువ ఉండ‌టం వ‌ల్లే నాటు సారా.. గ్రామాల వ‌ర‌కు వ‌స్తుంద‌ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. దీంతో గ్రామాల్లో నాటు సారా విచ్చ‌ల‌వీడిగా ల‌భింస్తుంద‌ని అన్నారు. అందు వ‌ల్లే సారా మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయ‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక‌ మ‌ద్యం ధ‌ర‌ల‌తో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల సోమ్మును దోపిడి చేస్తూ… మ‌రో వైపు ప్ర‌జ‌ల ఆరోగ్యంతో చెల‌గాటం ఆడుతుంద‌ని ఆరోపించారు.

అలాగే రాష్ట్రంలో ప్ర‌భుత్వం అమ్ముతున్న మ‌ద్యం డ‌బ్బులు దారి మ‌ల్లుతున్నాయిని అన్నారు. రాష్ట్రంలో ఎంత మ‌ద్యం విడుద‌ల అవుతుంది.. ఎంత అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయో ద‌ర్యాప్తు చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాల‌కు ఏయో వాహ‌నాలు వ‌స్తున్నాయో.. డ‌బ్బులు ఎవ‌రు వ‌సూల్ చేస్తున్నారో నిఘా పెట్టాల‌ని ప‌త్రికా విలేక‌ర్లను కోరారు. మ‌ద్యం అమ్మాక‌ల్లో డ‌బ్బులు కొంత శాత‌మే ప్ర‌భుత్వం చేతికి వ‌స్తుంద‌ని ఆరోపించారు. మిగితా అంతూ.. కూడా ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్తుంద‌ని మండిప‌డ్డారు. దీని వెనక ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు. దీనిపై స‌మగ్ర విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version