జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో కలవడం పట్ల ఏపీ బీజేపీ నేతలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. కచ్చితంగా ఈ కూటమి రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఉంటాయని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దక్షిణ భారతదేశంలోనే జనసేన-బీజేపీ కూటమి హైలెట్ అవుతుందని ఇతర పార్టీలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇటువంటి నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ తమ పార్టీలో రావడం తో టీడీపీకి ఇంకా రోజులు దగ్గరపడ్డాయి రాష్ట్రానికి దరిద్రం వదిలి పోయింది ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల కొద్దో గొప్పో తెలుగుదేశం పార్టీకి కొంత ఆదరణ ఉంది, పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి రావడం తో ఇంకా తెలుగుదేశం పార్టీ చాప్టర్ క్లోజ్ అయినట్లే అని బీజేపీ నేతలు ఫీల్ అవుతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికార దాహం కోసం మోడీ హవా అప్పట్లో దేశంలో కొనసాగుతున్న సందర్భంలో బీజేపీ కాళ్లు పట్టుకుని ఆ తర్వాత రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడీ దేశంలో 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చాలా దారుణమైన నీచమైన రాజకీయాలు చేసి బీజేపీని దెబ్బకొట్టాలని చూశాడు. ఆ సందర్భంలో జరిగిన ఏపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కొద్దో గొప్పో సత్సంబంధాలు కొనసాగించిన చంద్రబాబుకి భవిష్యత్తులో ఇంకా ఎటువంటి సంబంధాలు ఉండవని చంద్రబాబు ఏకాకి అయిపోయినట్లే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవటం గ్యారెంటీ అని ఏపీ బీజేపీ నేతలు ఫీలవుతున్నారు.