నామినేటెడ్ పదవుల కోసం ఏపీ బీజేపీ నేతల ఎదురుచూపులు.. ప్రయారిటీ ఇవ్వాలంటూ పట్టు..

-

ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బిజెపి.. గత ఎన్నికల్లో టిడిపి తో కలిసి పోటీ చేసింది.. పొత్తుల్లో భాగంగా కొందరు కీలక నేతలకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు.. అయినా కూడా ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే సీట్లను సంపాదించుకొని ఓటు షేర్ పెంచుకుంది.. అధికారంలోకొస్తే నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించిన సీనియర్లకు చంద్రబాబు మొండి చెయ్యి చూపారనే ఆవేదన బిజెపి నేతల్లో వ్యక్తం అవుతుంది.. ఏపీ బీజేపీ అధ్యక్షరాలు పురందేశ్వరి సైతం చంద్రబాబును కలిసి.. కీలక నేతలకు పదవులు ఇవ్వాలంటూ సూచించినా కూడా.. కొందరికి ఇప్పటివరకు పదవులు దక్కలేదు.. దీంతో బిజెపి నేతలు డీలా పడినట్లు కాషాయం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను గెలుచుకున్న బిజెపి.. ఏపీలో బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. పెరిగిన ఓటు షేర్ తో ఏపీ బీజేపీలో జోష్ నిండింది. ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బిజెపి.. పార్టీలో ఉండే కీలక నేతలకు పదవులు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.. సోము వీర్రాజు తోపాటు, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వంటి నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.. రెండో విడతలోనూ కీలక నేతలకు పదవులు దక్కకపోవడంతో.. వారంతా బిజెపి కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారట.

కీలకమైన పోస్టుల్లో తమకు అవకాశం ఇవ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారని కమలం పార్టీలో చర్చ నడుస్తోంది. చైర్మన్ పదవో లేదంటే కనీసం డైరెక్టర్ పోస్ట్ అయినా ఇప్పించాలంటూ కోరుతున్నారట.. నామినేటెడ్ పదవుల్లో జనసేనకు 30 శాతం బిజెపికి 10 శాతం పదవులు ఇస్తారని ఒప్పందం కుదిరిందని.. కానీ పదవుల పందేరంలో ఆ లెక్కలు కనిపించడం లేదని, ముఖ్యమైన క్యాబినెట్ ర్యాంకు పదవులలో తమకు అన్యాయం జరుగుతుందని బిజెపి నేతలు తెగ ఫీల్ అయిపోతున్నారట.. టిడిపిని ఒత్తిడి చేసి మరి పోస్టుల సంఖ్యను పెంచుకోవాలని కొంతమంది కమలం నేతలు పురందేశ్వరుని కోరారని కోరారని తెలుస్తుంది..

పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న తమను కాదని.. ఇటీవల బీజేపీలో చేరిన వారికి పదవులు వస్తుండడంపై పాత తరం బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. ఇప్పటివరకు బిజెపికి నాలుగు చైర్మన్ పదవులు, 15 మెంబర్ పదవులు దక్కాయి.. క్యాబినెట్ ర్యాంకు పదవులను .. పక్క పార్టీ నుంచి బిజెపిలో చేరిన వారికే వస్తున్నాయంటూ ఓ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.. సీనియర్ నేతలకు పదవులు ఇవ్వాలంటూ రాష్ట్ర నాయకత్వం కూడా చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకు రాలేదని అభిప్రాయంలో కొందరు బిజెపి నేతలు ఉన్నారట.. తాము చేసిన పార్టీ గుర్తించడం లేదని.. ఇలా చేస్తే అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు నేతలు బిజెపి పెద్దల వద్ద మొరపెట్టుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.. సీనియర్ నేతలు అసంతృప్తిని అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version