ఈ దేశాన్ని మనమే కాపాడుకోవాలి: ఢిల్లీలో బాబు.. పవార్ తో జత కుదిరేనా?

-

బీజేపీయేతర పక్షాలతో కలిసి భవిష్యత్ కార్యచరణ
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామనే నినాదం
ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడి

న్యూఢిల్లీ: బీజేపీ పాలనలో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీయేతర పక్షాలన్నింటిని కలుపుకొని వెళ్లేందుకు త్వరలో కార్యచరణ చేపడతామని తెలిపారు. గురువారం ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో శరద్ పవార్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ అబ్దుల్లాతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. శరద్ పవార్, ఫరూఖ్ వంటి సీనియర్ నేతలతో సంప్రదించానని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తున్నట్లు ఆయన చెప్పారు. భవిష్యత్ తరాలను కాపాడేందుకు, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పని కొనసాగుతోందని వెల్లడించారు. మిగిలిన విషయాలను త్వరలో వెల్లడిస్తామని చంద్రబాబు తెలిపారు. శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ భారత జాతి తీవ్ర సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఉమ్మడి కార్యచరణ(కామన్ మినిమం ప్రోగ్రాం) రూపొందించుకోవడం ద్వారా జాతిని ఎలా రక్షించుకోవాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version