టీడీపీ ఘోర పరాజయం పాలు కాగానే.. అప్పటి వరకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావు.. తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా జగన్.. విజయసాయిరెడ్డికి ఆ పదవిని ఇచ్చారు.
వైఎస్సార్సీపీ పార్టీ విజయంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు. ఏపీ సీఎం జగన్‌కు కూడా ఆప్తులు. రాజకీయ అనుభవం ఉన్న నేత. అంతే కాదు.. ప్రత్యర్థులను తన మాటల పంచులతో ముప్పుతిప్పలు పెట్టే నేత. కేంద్రంలో మోదీతోనూ ఆయనకు చనువు ఎక్కువే.
అందుకే.. జగన్ ఆయనకు కీలక పదవిని కట్టబెట్టారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు జగన్. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి అంటే మామూలు పదవి అనుకునేరు. ఇంచుమించు కేబినేట్ మంత్రి హోదా అది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. ఆ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. టీడీపీ ఘోర పరాజయం పాలు కాగానే.. అప్పటి వరకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావు.. తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా జగన్.. విజయసాయిరెడ్డికి ఆ పదవిని ఇచ్చారు.