కేంద్ర ప్ర‌భుత్వం ఆఫ‌ర్‌ను వ‌ద్ద‌న్న జ‌గ‌న్‌.. మాకు ప్ర‌త్యేక హోదా ఇస్తే చాలు..!

-

తమకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని.. ప్రత్యేక హోదా కోసం ఎంత దూరం అయినా పోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే తర్వాత అత్యధిక ఎంపీలను కలిగిఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ చరిత్రకెక్కింది. వైఎస్సార్సీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు ఉన్నది 52 మంది ఎంపీలే. డీఎంకేకు 23 మంది ఉన్నారు. అయితే.. లోక్‌సభలో వైఎస్సార్సీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. వైఎస్సార్సీపీకి 22 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో వాళ్లకు ఆ పోస్ట్ ఇస్తే ఎలా ఉంటుందన్న భావనలో మోదీ సర్కార్ ఉన్నట్లు సమాచారం.

వైఎస్సార్సీపీకి కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపిందట. కాకపోతే.. ఏపీ సీఎం జగన్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే ఆసక్తి లేదట. డిప్యూటీ స్పీకర్ పదవి వల్ల వచ్చేదేమీ ఉండదని.. ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వంతో కలుస్తామని జగన్.. కేంద్ర ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది.

తమకు స్పెషల్ స్టేటస్ ఇచ్చేంత వరకు పోరాటం ఆపేది లేదని.. ప్రత్యేక హోదా కోసం ఎంత దూరం అయినా పోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ఇప్పటికే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని మోదీని కలిసి ఏపీకి ప్రత్యేక హోదాపై వినతి పత్రం సమర్పించారు. నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ కూడా ప్రత్యేక హోదా తీర్మానానికి ఏకగ్రీవంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవాళ జ‌మిలీ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని మోదీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన భేటీలో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. అక్క‌డ కూడా జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌ధాని మోదీతో చ‌ర్చించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version