ఏపీ డీజీపీ అనవసరంగా ఇరుక్కుపోయారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పోలీసులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అంటుంది టీడీపీ. కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తు౦ది. ప్రధానంగా గౌతం సవాంగ్ లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆయన పోలీస్ బాస్ గా ఉన్నప్పుడు కనీసం పోలీసులపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

అదే విధంగా కొందరు అధికారులు ప్రభుత్వానికి లొంగిపోయారని, వాళ్ళు కావాలనే టీడీపీ నేతలను, ఎదురు తిరిగిన వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే… ఇక్కడ కొన్ని కొన్ని పరిణామాల ఆధారంగా చూస్తే, ఏపీ లో ఇప్పుడు డీజీపీ ఇబ్బంది పడుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. సాధారణంగా డీజీపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పడంతో పాటుగా,

టోటల్ పోలీస్ వ్యవస్థకు బాస్ గా ఉంటారు. రాష్ట్రంలో పోలీసు వ్యవహారాలు అన్నీ ఆయనదే బాధ్యత. విశాఖలో చంద్రబాబు పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసు అధికారులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు అనే ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి ముందు అనుమతి ఇచ్చి కూడా తర్వాత వద్దని, ఒక చిన్న నోటీసు ఇచ్చి, వెనక్కు వెళ్ళిపోవాలని, సెక్షన్ 151 ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

ఈ వ్యవహారంలో ఇప్పుడు డీజీపీ హైకోర్ట్ కి వెళ్ళారు. ఒక డీజీపీ నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు హైకోర్ట్ కి వెళ్ళారు. అటు ముఖ్యమంత్రికి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇటు కోర్ట్ కి సమాధానం చెప్పలేని పరిస్థితి. డీజీపీ పైకి చెప్పకపోయినా సరే ఇబ్బంది పడుతున్నారని, నిన్న వైసీపీ నేతల వ్యవహారంలో టీడీపీ హైకోర్ట్ కి వెళ్ళే సూచనలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు పోలీసు వర్గాలలో సైతం ఆందోళన వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news