ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో… ప్రజావేదికలో సీఎం సమావేశం నిర్వహించకూడదట. సీఎం సమావేశం నిర్వహిస్తే విజయసాయిరెడ్డికి వచ్చిన నొప్పేంది.. అంటూ ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు.
ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 11నే ముగిశాయి. వాటి ఫలితాలకు ఇంకా నెల సమయం ఉంది. కానీ.. ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు మాదంటే మాది అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా విరుచుకుపడిన టీడీపీ నేతలు.. సీఎం సమీక్షలు జరిపితే మీకు వచ్చిన నొప్పేంటి అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
ఈక్రమంలో.. ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి, వైసీపీకి ఆయన ఓ సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖపై తాను సమీక్ష జరుపుతానని.. ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు. నా శాఖ నాఇష్టం. నా శాఖలో సమీక్షను అడ్డుకోవడానికి మీరెవరు. నా సమీక్షను అడ్డుకుంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తా. సీఎం, మంత్రులు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఇంట్లో కూర్చోవాలా? పరిపాలించే హక్కును మాకు రాజ్యాంగం కల్పించింది. తెలంగాణలో విద్యార్థులు చనిపోయారు కదా. మరి.. దానికి ఈసీ బాధ్యత వహిస్తుందా? లేక ప్రభుత్వమా? అంటూ సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో… ప్రజావేదికలో సీఎం సమావేశం నిర్వహించకూడదట. సీఎం సమావేశం నిర్వహిస్తే విజయసాయిరెడ్డికి వచ్చిన నొప్పేంది.. అంటూ ఆయన వైసీపీ నేతలపై మండిపడ్డారు.