చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటున్న టీడీపీ నేతలు!

-

ప్రస్తుతం ఏపీలో తీవ్రస్థాయిలో లాక్ డౌన్ కొనసాగుతుంది! గ్రామాల్లో అయితే ఎవరికి వారు తమ తమ ప్రాంతాలను స్వీయ నిర్భందంలో పెట్టేసుకున్నారు! ఈ క్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ విషయంలో ఒకరిద్దరు వైకాపా నేతలు ర్యాలీలు చేపట్టి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు! అందరికీ మాస్కులు ఉన్నాయని, భౌతిక దూరం పాటించామని వారు ఎంత చెప్పినా… టీడీపీ నేతలు చేయాల్సినంత చేశారు! కరోనా సమయంలో గుంపులు గుంపులుగా రోడ్లపైకి రావడం ఏమిటి… మాస్కులు లేకుండా తిరగడం ఏమిటి… భౌతిక దూరం పాటించకుండా ఉండటం ఏమిటి… అంటూ ప్రశ్నల వర్షం కుర్పించారు… కరోనా సమయంలో ఇది ఏమాత్రం సరైన చర్య కాదని నీతులు చెప్పారు! కానీ… ఇవి వైకాపా నెతలకు చెప్పడానికే తప్ప తాము పాటించడానికి కాదని నిరూపించే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు!

కాస్త ఇంగితం ఉన్నవారు ఎవరైనా… ఈ కరోనా సమయంలో గుంపులు గుంపులుగా తిరగరు! కానీ… ఈ విషయంలో అలాంటి ఇంగితాలు మాకేమీ లేవనట్లుగా ప్రవర్తించిన సంఘటన ఒకటి తాజాగా జరిగింది! ఏపీలో జరుగుతున్న ఆవ భూముల సేకరణలో భారీఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతరం వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తాం అంటూ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామానికి వందల సంఖ్యలో కార్యకర్తలను వేసుకుని బయలుదేరారు! వారిలో సగానికిపైగా మాస్కులు లేనివారే కావడం గమనార్హం! ఇది రాజకీయాలకు సమయం కాదు… ప్రజారోగ్యమే ముఖ్యమని అంతా చెబుతున్నా కూడా పరిపూర్ణమైన నిర్లక్ష్యంతో టీడీపీ నేతలు తిరుగుతున్నారు!!

ఇలా వంద మందికిపైగా జనాలు మాస్కులు లేకుండా బయలుదేరేసరికి… పోలీసులు అడ్డుకున్నారు! లాక్‌ డౌన్‌ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున అనుమతించబోమని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. కరోనా సమయంలో అహర్నిశలూ కష్టపడి పనిచేస్తున్న పోలిసులతో వాగ్వాదానికి దిగడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో టీడీపీ నేతలే చెప్పాలి! పోలీసులు అడ్డుకుంటున్నా కూడా తప్పించుకుంటూ.. పరుగులు పెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు… ఈ క్రమంలో మూడుగంటలపాటు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఇది ఎలాంటి సమయం… నిన్నటి వరకూ వైకాపా నేతలకు మనం ఏమి చెప్పాం… వీడియో కాంఫరెన్సుల్లో మనం ఎలాంటి నీతులు, సూచనలు చెప్పాం… అన్న విషయం మరిచిన టీడీపీ నేతలు.. చెప్పేటందుకే నీతులు ఉన్నాయంటూ ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news