Jr ఎన్ఠీఆర్ పట్ల తన క్రోధాన్ని బయటపెట్టుకున్నాడు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. అచంటలో జరిగిన సభలో జై ఎన్ఠీఆర్ అన్నందుకు కొట్టి తరిమేశారు టీడీపీ నేతలు. ఇదంతా చంద్రబాబు కళ్ళ ముందే జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఊరుకున్నాడు.వారంతా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులే అయినప్పటికీ తనకు సపోర్ట్ చేయకపోతే తనలోని రాక్షసుడు ఎలా ఉంటాడో మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నాడు. దీంతో Jr ntr అభిమానులు చంద్రబాబు పట్ల రగిలిపోతున్నారు. జెండాలు లాక్కుని సభాస్థలి నుంచి బలవంతంగా బయటికి పంపడంతో ఆవేదనకు గురవుతున్నారు.
అచంటలో రా కదలి రా పేరుతో భారీ సభ నిర్వహించారు చంద్రబాబు. ఈ సభకు లక్ష మంది వస్తారని అంచనా వేశారు.అయితే కేవలం 12 వేల మంది హాజరు కావడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు టీడీపీ అధినేత. సభ కో ఆర్డినేటర్ లపై బాబు రగిలిపోయారు.అసలే టిడీపీ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోంది. ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది. దీనికితోడు కార్యకర్తలు అనుకున్న స్థాయిలో హాజరుకాలేదు. అక్కడున్న వారిలో కొంతమంది jr ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు. వారు జెండాలు పట్టుకుని జై ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు.
దీంతో పక్కనే ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానాయులపై రెచ్చిపోయారు.లోకేష్ సైన్యం ముందుకు వచ్చి జెండాలు లాక్కుని వారిని కొట్టి బయటికి పంపించేశారు. ఇదంతా చంద్రబాబు ఎదురుగా జరుగుతున్నా వారించకపోవడం గమనార్హం. పెద్దాయన మనవడికి సొంత పార్టీలో ఉండే విలువ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.అసకే కార్యకర్తలు రాక అసంతృప్తితో ఉన్న చంద్రబాబుకి ఈ సంఘటన ఆత్మసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. అధికారికంగా ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా అంతిమంగా తన మద్దతు టీడీపీకే. అతను టీడీపీకి దూరం అయ్యాను అని ఇంతవరకు ఎక్కడా చెప్పింది లేదు. అయినప్పటికీ తన వక్ర బుద్ధిని బయటపెట్టుకున్నాడు చంద్రబాబు.
ఇక ఆచంట సభలో జనసేన కార్యకర్తల జాడే లేదు. ఇరుపార్టీల పొత్తు నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించే ప్రతి సభకి రెండు పార్టీల నేతలు.కార్యకర్తలు హాజరు కావాలి. కానీ విభజించు పాలించు మనస్తత్వం ఉన్న చంద్రబాబు కేవలం టీడీపీ కేడర్ కు మాత్రమే ఆచంట సభ సమాచారం అందించారు. దీంతో అసహనానికి గురైన జనసేన శ్రేణులు ఆచంట సభను బహిష్కరించారు.
ఇదేమీ బయటికి రాకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు అసలు సభలో జనసేన ప్రస్తావన లేకుండా ప్రసంగించారు.దీనిపై పవన్ పార్టీలోని నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని టీడీపీ వైఖరిని తప్పుపడుతున్నారు జనసేన శ్రేణులు. పవన్ ని నమ్ముకుంటే విలువ లేకుండా పోతుందని ఆందోళనకు గురవుతున్నారు.