ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు .దీనికి ప్రధాన కారణం ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా కీలకం అలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పదవులు అనుభవించిన నేతలు కూడా ముందుకు రావడం లేదు. అనే విమర్శలు ఆ పార్టీ కార్యకర్తల నుంచి వినబడుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు తెలంగాణలో సత్తాచాటిన తెలుగు దేశం పార్టీ నేడు ఒక ఎమ్మెల్యే తో ఉంది. అంటే దానికి కారణం నాయకులే కనీసం పార్టీని ముందుకు నడిపించాలి అనే పట్టుదల కూడా లేకుండా కొంతమంది నాయకులు వ్యవహరించిన వ్యవహార శైలి ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు ఇదే విధమైన రాజకీయం జరుగుతోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు అందరూ ఇబ్బంది పడుతున్నారు.
అయినా సరే ఎమ్మెల్యే పదవులు,మంత్రి పదవులు పార్టీలో కీలక పాత్ర పోషించిన నాయకులు ఎవరు బయటకు రావటం లేదు. ప్రతి దానికి చంద్రబాబు పూసుకుని చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు రోడ్ల మీద కూర్చుని పోరాడటం. పార్టీలో కీలక నేతగా ఒక వెలుగు వెలిగిన వారు ఇప్పుడు పార్టీలో కనబడటం లేదు. దీనితో అసలు పార్టీ లో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి, ఆ పార్టీ కార్యకర్తలు మరి ఇప్పటికైనా బయటకు వస్తారా లేక ఇదే విధంగా ముందుకు వెళ్తారా చూడాలి.