బాబు….ఎంత కష్టం వచ్చిందయ్యా?

-

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పెద్ద కష్టమే వచ్చింది. అసలు 2019 ఎన్నికల నుంచి ఎలాగో బాబు కష్టాలు ఎదురుకుంటున్నారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. సరే గెలుపోటములు సహజం అనుకుని నాలుగు నీతి వాక్యాలు చెప్పుకుని పార్టీని పైకి లేపుదామని బాబు కిందా మీదా పడుతున్నారు.

కానీ జగన్ దెబ్బకు టి‌డి‌పి ఏ మాత్రం పైకి లేగట్లేదు…దానికి తోడు బాబు గారి వయసు కూడా మీద పడటంతో ఎక్కువగా ఇంటికే పరిమితం అవుతున్నారు…ఇటు తమ్ముళ్ళు కూడా ఇప్పుడు అనవసరంగా హడావిడి చేయడం ఎందుకు ఎన్నికల ముందు చూసుకుందాంలే అని సైలెంట్‌గా ఉంటున్నారు….ఇక చినబాబు ఏమో అమావాస్య, పౌర్ణమికి ఒకసారి అన్నట్లుగా జనాల్లోకి వచ్చి హడావిడి చేసి వెళ్లిపోతున్నారు.

ఇలా పరిస్తితులు ఉండటంతో తెలుగుదేశం ఏ మాత్రం వైసీపీకి పోటీ ఇవ్వలేకపోతుంది. ఆ విషయం 2019 ఎన్నికల నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనో రుజువైంది. సరేలే ఎన్నికలు ఓడిపోతే ఓడిపోయాం..వైసీపీకి మనమే ప్రత్యామ్నాయం…నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి పోటీ ఇస్తాంలే అని బాబు అనుకుంటున్నట్లు కనబడుతోంది. పాపం ఇప్పుడు ఆ పరిస్తితి కూడా పోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలో వార్ మారిపోతుంది. జగన్ వర్సెస్ పవన్ అన్నట్లు వార్ నడుస్తోంది. ఇక ఈ వార్‌లో బాబు సైడ్ అయిపోయారు. బాబు కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా కూడా, ఆ పార్టీ నేతలు మాత్రం బాబుని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. బాబుని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

పాపం బాబు దరిద్రం ఏంటంటే…టి‌డి‌పి అనుకూల మీడియాలో చర్చలు కూడా వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగానే నడుస్తున్నాయి. అక్కడ కూడా టి‌డి‌పికి స్పేస్ లేకుండా పోయింది. ఆఖరికి అనుకూల మీడియాలో కూడా బాబు సైడ్ అయ్యారు అంటే…బాబుకు పెద్ద కష్టమొచ్చిందనే చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version