క్రేజీ అప్డేట్ : మెగాస్టార్ మ‌రో సినిమాలో మాస్ మ‌హ‌రాజ్..?

-

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో 154వ‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటించబోతున్నట్లు సమాచారం. సినిమాకు కీరోల్ గా ఉన్న పాత్రలో రవితేజను తీసుకోవాలని బాబి నిర్ణయం తీసుకున్నారట. దాంతో ప్రస్తుతం రవితేజతో చర్చలు జరుపుతున్నారట. ఇదిలా ఉండగా ఇప్పటికే చిరు హీరోగా నటించిన అన్నయ్య సినిమాలో రవితేజ నటించారు. అంతేకాకుండా మెగాస్టార్ నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కూడా రవితేజ ఒక పాటలో మెరిశాడు. ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నారు. క్రాక్ సినిమా విజయంతో రవితేజ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version