ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఎన్నికలు లేకపోయినా సరే..ఇప్పుడే ఎన్నికలు ఉన్నట్లు వారి మధ్య యుద్ధం నడుస్తోంది. అలాగే పొత్తుల గురించి కూడా ఇప్పటినుంచే ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేనల మధ్య ఉండొచ్చని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి టీడీపీ-జనసేనలు కలవచ్చని చర్చలు జరుగుతున్నాయి.
కానీ అధికారికంగా మాత్రం ఈ పొత్తు విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే క్రమంలో తాజాగా కుప్పం టూర్‌లో ఉన్న చంద్రబాబు…పవన్‌తో కలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం పర్యటనలో ఉన్న బాబుని, ఒక టీడీపీ కార్యకర్త ఆసక్తికర ప్రశ్న అడిగారు..’మీరు వచ్చే ఎన్నికల్లో పవన్‌తో కలిసి పోటీ చేస్తున్నారా? అని అడిగారు..ఇక దీనికి చంద్రబాబు ఫుల్ సెటైరికల్‌గా సమాధానం ఇచ్చారు…ఆ కార్యకర్తని ఉద్దేశించి…చూడు తమ్ముడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేశావు..ఆ అమ్మాయి కూడా నిన్ను లవ్ చేయాలి కదా’ అని మాట్లాడారు. ‘లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులు ఉండాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వన్‌సైడ్ లవ్ సరికాదని చంద్రబాబు చమత్కరించారు.
అంటే ఇక్కడ బాబు, పవన్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తిగానే ఉన్నారు…కానీ పవన్ మాత్రం ఆసక్తిగా లేరన్నట్లు బాబు చెప్పుకొచ్చినట్లు కనిపిస్తోంది. మరి బాబు లవ్‌ని పవన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.