బద్వేల్ స్పెషల్: పవన్ పేపర్ పులి కాదంటే… రెండే ఆప్షన్స్!

-

ప్రస్తుతం ఏపీలో ప్రధానప్రతిపక్ష పార్టీ పాత్రను జనసేన పోషిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ ఆశించిన స్థాయిలో హడావిడి చేయకపోవడంతోనో ఏమో కానీ.. గత రెండు మూడు రోజులుగా పవన్ ఆ పాత్ర పోషిస్తున్నారు. రకరకాల యాష్ టాగ్స్ పెడుతూ.. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే బద్వేల్ ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది.

pawan-kalyan

సినిమా ఫంక్షన్స్ వేదికలమీద, ట్విట్టర్ వేదికల మీద ఏపీ సర్కార్ పై అటు సబ్జెక్ట్ తో కూడిన విమర్శలు, ఇటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఫుల్ హీట్ క్రియేట్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాజాగా “ఏపీ స్టేట్ కండిషన్స్ ఇన్ ఎ స్నేప్ షాట్” అంటూ కొన్ని ఫోటోలు పెడుతూ.. తనదైన కామెంట్లు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

“వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’కి అన్నీ రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..” అంటూ పోస్టులు పెడుతున్న పవన్ కు అదే సోషల్ మీడియా వేదికగా కొన్ని ఘాటైన రిప్లై లు వస్తున్నాయి. “ట్విట్టర్ లో సందడి ఎందుకు – బద్వేల్ లో తేల్చుకుందా రా”… “మీ సత్తా ఏమైనా ఉంటే.. బద్వేల్ లో చూపించు మిత్రమా”… “ఒంటరిగా వచ్చే ధైర్యం లేకపోతే – మిత్రులను వెంటతెచ్చుకో – లేదంటే వారి చంకనెక్కి రా సోదరా” అంటూ కామెంట్లు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయని కాదు కానీ… తన పోరాటాన్ని జనాలు విశ్వసిస్తున్నారా.. తనకు ప్రజల్లో క్రెడిబిలిటీ పెరిగిందా.. తాను చెబుతున్నట్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడిందా వంటి విషయాలపై క్లారిటీ కోసమైనా పవన్ బద్వేల్ ఉప ఎన్నికలో రంగంలోకి దిగాలి! తన సత్తా ఏమిటో సమాజానికి చాటాలి.

అవును… పవన్ హాట్ హాట్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిన ఈ తరుణంలో… బద్వేల్ ఉప ఎన్నిక తెరపైకి రావడంతో… పవన్ రంగంలోకి దిగాల్సిన అవసరం చాలా ఉంది! తనకు సొంతంగా పోటీచేసే పరిస్థితి లేకపోయినా.. మిత్రపక్షం బీజేపీతో కలిసి గట్టిగా పోరాడాలి. తన సత్తా కచ్చితంగా చూపించాలి. అలాకానిపక్షంలో… పవన్ కేవలం పేపర్ పులే అనే అభిప్రాయం నిజం అయ్యే ప్రమాధం ఉంది.

ఇదే సమయంలో… టీడీపీ తరుపున ప్రచారం చేస్తాను అనే మాటలు పవన్ మాట్లాడితే మాత్రం… అది కచ్చితంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది! ఇప్పుడు పవన్ కు రెండే ఆప్షన్స్ ఉన్నాయి! తన అఫీషియల్ మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీచేసి కనీసం వైకాపా మెజారిటీకి గండి కొట్టాలి! లేదా, వైకాపా కు షాకిచ్చే స్థాయిలో విజయం నమోదు చేయాలి! పరోక్షంగా పసుపు రంగు కడిగేసుకోవాలి! అవితప్ప ఏమి చేసినా… పవన్ “కాగితం పులే” అనే విమర్శకు బలం చేకూరడం పక్కా!!

 

Read more RELATED
Recommended to you

Exit mobile version