మంత్రి అనిల్ కుమార్‌కు బండ్ల గ‌ణేష్ కౌంట‌ర్

ఆంధ్ర ప్ర‌దేశ్ లో సినిమా టికెట్ల ర‌గ‌డ ముదురుతుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెల‌గు సినిమా న‌టుల మ‌ధ్య మాటాల బాంబులు పేలుతున్నాయి. కౌంట‌ర్ ప్ర‌తి కౌంట‌ర్ ల‌తో రాష్ట్రంలో వేడి పెరిగింది. ఇటీవ‌ల సినిమా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో హీరో నాని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఏపీ మంత్రులు వ‌రుస‌గా హీరో నానిని టార్గెట్ చేస్తూ.. సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. అందులో భాగంగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ కూడా హీరో నాని పై ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అయితే మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లకు బండ్ల గ‌ణేష్ కౌంట‌ర్ ఇచ్చారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి అనిల్ కుమార్ ను అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా.. అంటూ తన దైన శైలి లో కౌంట‌ర్ ఇచ్చాడు. కాగ మంత్రి అనిల్ కుమార్ హీరో నాని ని ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. అలాగే తాను ప‌న‌వ్ క‌ళ్యాణ్ సినిమా లు విడుద‌ల అయితే బైక్ అమ్మి మ‌రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ట్ అవుట్ ల‌ను కట్టాన‌ని అన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌నే బండ్ల గ‌ణేష్ ట్యాగ్ చేస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే ప్ర‌స్తుతం సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య ఉన్న ర‌గడ ఇప్ప‌ట్లో త‌గ్గే విధంగా లేదు.