తిరుగులేని కే‌సి‌ఆర్ గెలుపుల వెనకాల సూత్రం ఇదే !

-

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం తో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కి మరోసారి తిరుగులేదని నిరూపించారు కేసీఆర్. దేశంలోనే మున్సిపల్ ఎన్నికల్లో ఈ విధమైన ఫలితాలు రావటం కేవలం టిఆర్ఎస్ పార్టీకే చెల్లిందని జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.

అయితే కేసీఆర్ ఈ విధంగా గెలవటానికి గల కారణం చూస్తే కేటీఆర్ అని సోషల్ మీడియాని చాలా అద్భుతంగా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారని డిజిటల్ స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్ కేటీఆర్ చాలా తెలివిగా చేశారని సోషల్ మీడియా ని చాలా గట్టిగా ఉపయోగించుకుని తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ గెలిచాక తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరిగిందో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని దాని వల్లే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం వార్ అంతా వన్ సైడ్ అయ్యిందని జాతీయ పార్టీలను కూడా మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పక్కన పెట్టటం చాలా ఆశ్చర్యం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫేస్ టు ఫేస్ పార్టీ నాయకులతో వ్యూహాలు వేసిన కేటీఆర్…తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాని ప్లాట్ ఫాం గా చేసుకొని ప్రత్యర్థి పార్టీలకు చుక్కల చూపించారని కెసిఆర్ కి తిరుగు లేదని కేటీఆర్ నిరూపించారని తెలంగాణ రాష్ట్రంలో వార్తలు వినబడుతున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version