మంచి దూకుడులో ఉన్న భూమన వారసుడు,త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి

-

సినిమా అయినా,రాజకీయం అయినా వారసత్వం అనేది కొనసాగడం కొత్తేమి కాదు. ప్రతి ఒక్క నేత కూడా తమ వారసత్వం గా తమ బిడ్లలను కూడా దింపి దానినే వారసత్వంగా కొనసాగించాలని చాలామంది భవిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు,తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి ని రాజకీయాల్లో అడుగుపెట్టించాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించడాన్ని చూస్తున్న చాలామంది నేతలు… తండ్రి అడుగుజాడల్లోనే అభినయ్ రెడ్డి కూడా నడుస్తున్నాడని చర్చించు కుంటున్నారు. వైసీపీలో భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ నేత. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన అప్పట్లో ప్రకటించారు. కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకే ఆయన ఈ రకమైన ప్రకటన చేశారని అప్పట్లో అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల సమయానికి అభినయ్ రెడ్డి ని తయారు చేసి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దించాలని భూమన ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తిరుపతిలో వైసీపీకి టీడీపీ బలమైన ప్రత్యర్థిగా ఉంది.

గత ఎన్నికల్లో భూమన ఎమ్మెల్యేగా గెలిచినా… టీడీపీ కూడా గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించింది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని దెబ్బ కొట్టేందుకు భూమన కొడుకును రంగంలోకి దింపాలని చూస్తున్నారు. టీడీపీలోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకోవడంతో వీరిద్దరు సక్సెస్ అవుతున్నారని కూడా సమాచారం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో టీడీపీ శ్రేణులకు ఏర్పడిన గ్యాప్ కూడా వీరికి కలిసొస్తుందని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల నాటికి భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడికి తిరుపతిలో ఎదురులేకుండా చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version