తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నిత్యం వివాదంలో నిలుస్తూ వార్తల్లో ఎక్కువ వైరల్ అయిన నాయకుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వనజాక్షి ని కొట్టడం ఆ తర్వాత ఇసుక దోచుకున్నట్లు అదేవిధంగా అసెంబ్లీలో వైయస్ జగన్ ని దారుణంగా విమర్శించడం వంటి విషయాల్లో ఎక్కువ పాపులర్ అయ్యారు చింతమనేని ప్రభాకర్. కాలం మారటం ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడం ఇదే సమయంలో నియోజకవర్గంలో చింతమనేని ఓడిపోవడం జరిగింది. దీంతో ఎప్పటి నుండో కాచుకు కూర్చున్న వైసిపి నాయకులు అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు చింతమనేని ప్రభాకర్ పై ఉన్న కేసులు అన్ని బయటకు తీసి ఆయన్ని దాదాపు రెండు నెలలపాటు జైల్లో పెట్టడం జరిగింది.
ఇటువంటి తరుణంలో చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టిడిపి అధిష్టానం పిలుపుమేరకు అనేకసార్లు పోలీసుల కళ్లు గప్పి వెళ్లాలని ప్రయత్నించిన చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ప్రతీ విషయంలో ఇంకా చింతమనేని రెచ్చిపోతున్న తరుణంలో మళ్లీ పాత కేసులను బయటకు తీసి చింతమనేని కి బెయిల్ రద్దు చేయడానికి తిరిగి కటకటాల్లోకి పంపించడానికి అధికార పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.