తాలిబన్లకు ఎదురుదెబ్బ : నిధులు నిలిపేసిన ప్రపంచ బ్యాంకు !

-

వాషింగ్టన్ : ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు ఎదురు దెబ్బ తగిలింది. తాలిబన్ల అన్యాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రపంచ బ్యాంకు..రంగంలోకి దిగి.. నిధులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్‌ లో చేపట్టిన ప్రాజెక్టు లకు నిధులు నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ బ్యాంకు.

ఇక ఇప్పటికే అఫ్గాన్‌ కు ఐఎంఎఫ్‌ చెల్లింపులు నిలిపివేయగా.. తాజాగా నిధులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రపంచ బ్యాంకు. దీంతో అఫ్గానిస్థాన్‌ కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఇక అటు అఫ్గానిస్థాన్‌ కు రిజర్వు లను అమెరికా నిలిపేసిన సంగతి తెలిసిందే.

కాగా గత వారం రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు దౌర్జన్యంగా స్వాధీనపరుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ లో… చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల ఆగడాలకు అక్కడి ప్రజలు ఒక్కొక్కరుగా దేశం విడిచి ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల ఆగ్రహానికి కూడా కొంత మంది మృతి చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version