సికింద్రాబాద్‌పై కమలం కన్ను..ఆ సీట్లలో ఈజీ కాదా?

-

తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి కమలం పార్టీ ఆతృతతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి..తెలంగాణని సొంతం చేసుకోవాలని చూస్తుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా బీజేపీ నేతలు ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో తమకు బలం ఉన్న స్థానాల్లో ఎక్కువ ఫోకస్ చేసి వాటిని సొంతం చేసుకోవాలని చూస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీకి బలం పెరిగిన విషయం తెలిసిందే. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సైతం బి‌ఆర్‌ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బి‌జే‌పి పోటీ ఇచ్చింది. అందుకే ఈ సారి గ్రేటర్ పరిధిలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పార్లమెంట్ సీటుపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది.  ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. దాదాపు 62 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్ధి తలసాని సాయి కిరణ్‌పై గెలిచారు.

 

అయితే 2014 ఎన్నికల్లో సైతం ఈ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. అందుకే సికింద్రాబాద్ పార్లమెంట్‌పై బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ పార్లమెంట్ పరిధిలో మెజారిటీ అసెంబ్లీ సీట్లని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ పార్లమెంట్ పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి ఎం‌ఐ‌ఎం గెలుచుకోగా, మిగిలిన సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అంటే ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలోచ్చేసరికి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీ సీటుని బీజేపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి..జూబ్లీహిల్స్, నాంపల్లి మినహా మిగిలిన సీట్లలో లీడ్ వచ్చింది. ఇప్పుడు ఆ సీట్లని గెలుచుకోవాలని బీజేపీ చూస్తుంది. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్ స్థానాలని గెలుచుకోవాలని చూస్తుంది. మొత్తం 7 స్థానాల్లో సనత్‌నగర్, జూబ్లీహిల్స్‌, నాంపల్లి స్థానాల్లో బీజేపీకి గెలుపు కాస్త కష్టం.  మరి వీటిల్లో ఈ సారి బీజేపీ ఏ సీట్లు గెలుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version