దేశంలో ఎన్నికల్లో బీజేపీ గెలవకున్నా.. పరిపాలించే పార్టీ బీజేపీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలవకున్నా.. పార్టీలను, ఎమ్మెల్యేలను బెదరించి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీని పై బీజేపీ నాయకులు చర్చకు సిద్దామని అని సవాల్ విసిరారు. కర్ణాటక, మధ్య ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.
జనరల్ ఎన్నికల్లో గెలవని బీజేపీ.. ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. మహారాష్ట్రలో అయితే అర్థ రాత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఎన్ని రోజులు బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందని అన్నారు. బీజేపీ నాటకాలు చూసి మహారాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారని అన్నారు. ఎలాంటి సంస్కారం లేని పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. దేశంలో ప్రజా తీర్పూ గౌరవించని ఏకైక పార్టీ బీజేపీ అని విమర్శించారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని అన్నారు.