మోడీషాలకు సినిమా మొదలైందా…? వాడిపోతున్న కమలం…!

-

అవును మోడీ షాలకు చుక్కలు కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు అధికారమే పరమావధిగా భావించిన ఈ ద్వయం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇన్నాళ్ళు రాజకీయంగా తమకు తిరుగులేదని భావించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజకీయంగా పతనం అంచున నిలబడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 303 స్థానాలతో తిరుగు లేని ఆధిక్యం సాధించిన ఆ పార్టీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క దాంట్లో కూడా అధికారంలోకి సొంతగా రాలేకపోయింది.

హర్యానాలో జేజేపి తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసిన బిజెపి, మహారాష్ట్రలో శివసేనను ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. కాని శివసేన అనూహ్యంగా ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఝార్ఖండ్ లో కూడా బిజెపి అధికారంలోకి రాలేకపోతు౦ది. కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా ఝార్ఖండ్ లో దూసుకుపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మార్క్ ని కాంగ్రెస్ దాటేసింది. దాదాపు అధికారం చేపట్టడం ఖాయంగా కనపడుతుంది.

ఇక పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ అధికారం కోల్పోయే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న మోడిషా ద్వయంలో ఆందోళన మొదలయింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. కర్ణాటకలో అధికారంలోకి నానా ఇబ్బందులు పడి వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రాన్ని కూడా ఆ పార్టీ పోగొట్టుకుంది. వచ్చే ఏడాది జరిగే బీహార్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలిచే అవకాశాలు లేవనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version