బిజెపి ఎంపీ సుజనా చౌదరీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీకి షాక్ ఇచ్చి సుజనా చౌదరి బిజెపి తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కచ్చితంగా కేసులు గురించి పార్టీ మారి ఉంటారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. రాజకీయంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేరు సుజనా.
ఆయనకంటూ
ఇక ఇప్పుడు ఆయనకు కూడా సమయం దగ్గరకు వచ్చింది అంటున్నారు. ఆయన్ను త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని బ్యాంకులకు ఆయన దెబ్బ గట్టిగా తగిలిందని బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ మీద ఆర్బిఐ కూడా ఒత్తిడి చేస్తుంది అని సమాచారం. అందుకే ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే ఈడీ, ఐటి కూడా ఆయన ఆస్తుల మీద కన్నేసింది అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆయన తీసుకున్న రుణాల ప్రభావం దెబ్బ గట్టిగా ఉందని సమాచారం. ఇక అటు కేంద్ర పెద్దలు కూడా ఆయన్ను కలవడానికి ఇష్టపడటం లేదు. దీనితో సుజనా ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారని అంటున్నారు. మొత్తం ఆరువేల కోట్లకు సంబంధించిన లావాదేవీల్లో ఆయన మీద అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కీలక పత్రాలు కూడా బ్యాంకులు ఇచ్చినట్టు సమాచారం.