ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా ఉంది అనే వ్యాఖ్యలు కొంత మంది చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి అని… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి వాలంటరీ వ్యవస్థ ను వాడుకున్నారు అనే వ్యాఖ్యలు కొంత మంది చేశారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ కు చాలా బలంగా ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
విజయసాయిరెడ్డి చెప్పినట్టు 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలు వాలంటీర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపణలు విపక్షాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు వాలంటీర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ పై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ కనీసం ప్రభావం చూపించలేకపోయింది.
భారతీయ జనతా పార్టీ కారణంగా జనసేన పార్టీ కూడా కొన్ని స్థానాలు కోల్పోయిందని ఆ పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది టీడీపీతో పాటు తమను కూడా ఇబ్బంది పెడుతోంది అనే భావనలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. అందుకే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ఏ విధంగా వాడుతున్నారు ఏంటి అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు గా తెలుస్తోంది.