ఈ రోజు రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాలు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అధ్య‌క్ష‌తన‌ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశాలు హైద‌రాబాద్ లో ని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో జ‌ర‌గ‌న‌నున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ల పై బీజేపీ నాయకులు, కార్యకర్తలపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడుల పై మాట్లాడ నున్నారు. అలాగే రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్య, దళిత సమస్యలు, గిరిజనుల సమస్యలు, కార్మికులసమస్యలపై చర్చించే అవ‌కాశం ఉంది.

అలాగే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు వ్య‌తిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేస్తారు. కాగ స‌మావేశాల‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, జాతీయ సహా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శివ ప్రకాష్, ఓ బి సి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్, బిజెపి శాసనసభా పక్ష నాయకులు రాజాసింగ్ తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొంటారు. అయితే ఈ స‌మావేశాల‌ను ముందు గా అదిలాబాద్ లో నిర్వహించాలని భావించారు. అయితే ఎన్నికల కోడ్ ఉండ‌టం వ‌ల్ల హైద్రాబాద్ కు మార్చారు.