బ్రేకింగ్; కేంద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కెసిఆర్…!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపితో రహస్య స్నేహం చేస్తున్నారని ఒక పక్క విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉండగానే కెసిఆర్ కేంద్రానికి వరుస షాక్ లు ఇస్తున్నాయి. రాజకీయంగా తెలంగాణాలో కెసిఆర్ ని ఇబ్బంది పెట్టాలని బిజెపి భావిస్తూ రాజకీయం చేస్తున్న తరుణంలో కెసిఆర్ ఊహించని షాక్ ఇచ్చారు కేంద్రానికి. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కేంద్రానికి ఎదురు తిరిగిన కెసిఆర్…

ఇప్పుడు ఎన్పిఆర్ విషయంలో కూడా అదే చేసారు. ఎన్పిఆర్ ని రాష్ట్రంలో అమలు చేసేది లేదని చెప్పారు కెసిఆర్. రాష్ట్రంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఎన్పీఆర్ విషయంలో పలు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి, దేశంలో పదేళ్లకోసారి జనగణన చేపడతారు.

2011 తర్వాత అంటే.. 2020-2021 సంవత్సరంలో జనగణన జరగాల్సి ఉండగా… ప్రతీ అయిదేళ్ళ కు ఒకసారి ఎన్పీఆర్ సవరణ చేస్తున్నారు. ఈ ఫార్మాట్‌లో కేంద్రం కొత్త ప్రశ్నలు చేర్చడం ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతుంది. దీనితో కెసిఆర్ సర్కార్ ఎన్పీఆర్ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాత నమూనాతోనే ఎన్పీఆర్ ప్రక్రియను కొనసాగించాలని కేంద్రాన్ని తెలంగాణ సర్కారు కోరినట్లు తెలుస్తుంది.

అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఈ ప్రక్రియ గురించి సీనియర్ అధికారులతో మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఇక పౌరసత్వ సవరణ చట్టం రాష్ట్రంలో అమలు చేసేది లేదని తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో మైనార్టీ లు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. దీనితో కెసిఆర్ సర్కార్ ఈ విషయంలో వారికే అండగా నిలుస్తూ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version